Skip to main content

Namaste NRI

నిమ్మకాయ నీకెందుకు భయం .. గ్రాండ్‌గా లాంచ్

ఆధునిక సమాజంలో మూఢనమ్మకాల్ని ప్రశ్నిస్తూ తెరకెక్కిస్తున్న నిమ్మకాయ నీకెందుకు భయం చిత్రం ప్రారంభమైంది. రాజేష్‌ భూపతి, స్వప్నరాజ్‌, అబిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుమన్‌, ఆమని ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడు. బి.వి.సి.ఫిల్మ్స్‌ పతాకంపై బీఎన్‌ఆర్‌ చౌదరి నిర్మిస్తున్నారు. మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, చక్కటి వినోదంతో పాటు సందేశంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఆగస్ట్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాత పేర్కొన్నారు.

సుమన్ మాట్లాడుతూ ఈ సినిమా కథలో హారర్, థ్రిల్లర్ అంశాలు ఎంతో అద్భుతంగా మరియు ఆసక్తికరంగా మిళితమై ఉన్నాయని, కథ వినగానే తనకు బాగా నచ్చేసిందని తెలిపారు. చాలా కాలం తర్వాత నటి ఆమణితో కలిసి ఒక మంచి ప్రాజెక్ట్‌లో నటించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: వరికుప్పల యాదగిరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకుడు: రోశిరెడ్డి పందిళ్లపల్లి.

Social Share Spread Message

Latest News