ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేయనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి అన్ని దారులూ వెతుకుతున్నాయని, తనపై పెట్టిన అవిశ్వాసంతో ప్రతిపక్షాలు ఎంత మాత్రమూ నెగ్గవని ఇమ్రాన్ ధీమా వ్యక్తం చేశారు. చివరి అవకాశం వరకూ తాను వేచి చూస్తునే వుంటానని అన్నారు. చివరాఖరుకు తాను ప్రతిపక్షాలకు షాక్ ఇస్తానని ప్రకటించారు. ప్రతిపక్షాలు తీవ్రమైన ఒత్తిడిలో వున్నాయని, ఏం చేయాలో పాలుపోవడం లేదని విమర్శించారు. తన దగ్గర చాలా వ్యూహాలున్నాయని, ఇప్పటి వరకూ ఏ వ్యూహాన్ని బయటకు తీయలేదన్నారు. నేను చేతులు ముడుచుకొని కూర్చున్నానని అందరూ అనుకుంటున్నారు. అలా ఏమీ కాదు అని అన్నారు. అసలు రాజీనామా ఎందుకు చేయాలి? దొంగలు పెట్టే ఒత్తిడి వల్ల నేను రాజీనామా చేయాలా? అని మండిపడ్డారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)