నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం అమ్మాయిలు అర్థంకారు. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నందిరెడ్డి విజయ లక్ష్మీ రెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డుల చిత్రాల దర్శకుడిగా నరసింహ నంది చిత్ర పరిశ్రమలోని ఎందరో నవతరం దర్శకులకు ప్రేరణగా నిలిచారు. మధ్యతరగతి ప్రేమకథతో ఆయన తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేస్తుందన్న నమ్మకం ఉంది అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ నాలుగు జంటల ప్రేమ కథలో ఏర్పడే మలుపులు, భావోద్వేగాలతో ఈ సినిమా ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది అన్నారు.