హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం ఎన్నారై టీఆర్‌ఎస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తుందని ఎన్నారై టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌కే ఓట్లేస్తామని, గెల్లుదే గెలుపని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయని వెల్లడిరచారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రచారం చేశామని, ఎక్కడికి వెళ్లినా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉంటామని తేల్చి చెబుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధుతో దళిత వాడల్లో పండుగ వాతావరణం ఏర్పడిరదని చెప్పారు. ఈ పథకంతో తమ జీవితాలు మారిపోయాయని, గెలు శ్రీనివాస్‌ను భారీ మెజారీటీతో గెలిపించుకుని ముఖ్యమంత్రి కృతజ్ఞత తెలుపుకుంటామని దళిత సోదరులు చెప్పున్నట్లు తెలిపారు.
హుజూరాబాద్‌లో అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌ను భారీ మెజారీటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓటు వేస్తే హుజూరాబాద్‌కు వచ్చే లాభం లేదన్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది బీజేపీ డ్రామాలు చేస్తున్నదని, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని వెల్లడిరచారు. అందువల్ల ప్రజలంతా వాటిని నమ్మకుండా ఓటుతో వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
ఎన్నారై టీఆర్‌ఎస్ నాయకుల ప్రచారానికి సహకరించి ప్రోత్సహించిన ఎన్నికల ఇంచార్జ్ మంత్రి హరీష్ రావుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌కు, మంత్రి గంగుల కమలాకర్‌కు, ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి, స్థానిక నాయకులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు ఎన్నారై టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ శానబోయినకు, మీడియా మిత్రులకు, టీఆర్‌ఎస్ కార్యకర్తలకు అనిల్ కూర్మాచలం ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.