కెనడా ప్రధానిగా రాజీనామా చేసిన జస్టిన్ ట్రూడో క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని సంకేతాలిచ్చారు. వచ్చే అక్టోబర్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. ఒట్టావాలో జరిగిన మీడియా సమావేశంలో ట్రూడో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయబోను. ఇది నా నిర్ణయం అని చెప్పారు. కెనడా ప్రావిన్షియల్ ప్రధానులతో సమావేశం తర్వాత ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో పాలన, పన్నుల వ్యవస్థతో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో జస్టిన్ ట్రూడో చర్చించారు. 2008 నుంచి కెనడా పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారు. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ 50.3 శాతం ఓటింగ్ పొందిన జస్టిన్ ట్రూడో, చివరిగా 2021లో విజయం సాధించారు. తన భవిష్యత్ గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం లేదని, తనకు కెనడియన్లు ఇచ్చిన సమయంలో వారి కోసం అసాధారణ సేవలు అందించానని చెప్పారు.
