తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లిం దేశాల నుంచి పౌరుల రాకపోకలపై నిషేధాన్ని పునరుద్ధరిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ యూదు కమిటీ వార్షిక సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ప్రయాణ నిషేధం మీకు గుర్తుందా? నేను రెండోసారి అధ్యక్షుడినైన తొలి రోజే ఆ నిషేధాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం. మన దేశంలో బాంబు పేలుళ్లను ఇష్టపడే వ్యక్తులు మన దేశంలోకి ప్రవేశించాలని మనం కోరుకోవద్దు. అందుకే ఈ నిషేధం. గతంలో మా ప్రభుత్వ యంత్రాంగం తీసుకొచ్చిన ఈ చర్య అద్భుత విజయం సాధించింది. నా హయాంలో ఒక్క దుర్ఘటన జరగకపోవడానికి చెడు వ్యక్తులను దేశంలోకి అనుమతించకపోవడమే కారణం అని ట్రంప్ పేర్కొన్నారు.