
ధనుష్-సాయిపల్లవి కలయికలో మరో సినిమా రాబోతున్నది. అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించబోతున్నారు. ధనుష్ 55 వర్కింగ్ టైటిల్‌తో రూపొందను న్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇద్దరు కథానాయికలకు చోటున్న ఈ సినిమాలో ఇటీవలే శ్రీలీలను ఓ నాయికగా ఖరారు చేశారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి సాయిపల్లవి ఎంటరైంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఫొటోను విడుదల చేసింది. అమరన్ తరహాలోనే దేశభక్తి ప్రధానంగా సాగే కథాంశమిదని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గూఢచారి ఇతివృత్తంతో తెరకెక్కించబోతున్నారని సమాచారం.















