Skip to main content

Namaste NRI

పాకిస్థాన్ మంత్రికి బిర్యానీ పెడతారా?.. కాంగ్రెస్ నిప్పులు!

భారత్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్‌కు పాకిస్థాన్‌ను ఆహ్వానించడంపై దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. సరిహద్దు ఉగ్రవాదం కొనసాగుతున్న వేళ, సింధు జలాల ఒప్పందంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్ మంత్రులను దేశ రాజధానికి ఆహ్వానించి అధికార ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. మన దేశాన్ని హెచ్చరించినవారికే కేంద్రం మర్యాదలు చేసి బిర్యానీ తినిపిస్తుందా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

నవంబర్ 20 నుంచి 22 వరకు ఢిల్లీలోని పురానా ఖిలా వేదికగా జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు పాకిస్థాన్ తన దేశం తరఫున క్లైమేట్ చేంజ్ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్‌ను నామినేట్ చేసింది. కొద్దికాలం క్రితం భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సింధు జలాలను అడ్డుకోవాలని చూస్తే చేతులు నరుకుతామని హెచ్చరించిన వ్యక్తికి మన దేశంలో జరిగే సదస్సులో పీఠ వేయడంపై విపక్షాలు నిలదీస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో చర్చలు, సాంస్కృతిక బంధాలంటూ బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు.

మరోవైపు కేంద్రంలోని అధికార బీజేపీ నాయకులు ఈ విమర్శలను తిప్పికొట్టారు. ఇది ద్వైపాక్షిక చర్చ కాదని, బహుపాక్షిక వేదిక అని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని వీడితేనే పాకిస్థాన్ తన మనుగడను కాపాడుకోగలదని, లేదంటే ఆ దేశమే సర్వనాశనమవుతుందని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఏదేమైనా, తీవ్ర ఉగ్రవాద ఘర్షణలు, నిలిచిపోయిన ద్వైపాక్షిక సంబంధాల నడుమ పాక్ మంత్రి భారత్ పర్యటనకు వస్తుండటం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events