బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు వేళ్లంది. 2008 ఒలింపిక్స్ నిర్వహించిన ప్రధాన స్టేడియంలోనే అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారికంగా ఆటలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. బాణాసంచా మెరుపులు, ప్రదర్శనలతో వెలిగిపోగా వింటర్ ఒలింపిక్స్ ఆరంభోత్సవం కనులపండువగా జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు తదితర ప్రపంచ నాయకులు ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. 14 ఏండ్ల క్రితం విశ్వక్రీడల ఆరంభోత్సవాల్లోనే ఒక నయా ఆధ్యాయాన్ని లిఖించిన చైనా ఈసారి మాత్రం సాదాసీదాగా వేడుకలు నిర్వహించింది. 90 దేశాలకు చెందిన ప్లేయర్లు పాల్గొంటున్న ఈ క్రీడల్లో భారత్ నుంచి ఏకైక స్కీయర్ ఆరిఫ్ ఖాన్ పాల్గొంటున్నాడు. ఆరంభ వేడుకల్లో భాగంగా ఆరిఫ్ త్రివర్ణ పతకాన్ని చేబూని ముందుకు సాగాడు. అదే విధంగా హైతీ, సౌదీ అరేబియా తొలిసారి వింటర్ ఒలింపిక్స్ బరిలో దిగబోతున్నాయి. సౌదీ తరపున ఫయిక్ అబ్ది (స్కీయింగ్), హైతీ తరపున రిచర్డ్ వియానో (స్కీయింగ్) పోటీపడబోతున్నారు. ఇక పక్షం రోజులకు పైగా అభిమానులకు సందడే. వేసవి, వింటర్ రెండు ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఘతనను బీజింగ్ సొంతం చేసుకుంది.