5జీ సేవలు విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ప్రారంభం కానున్న 5జీ సీబ్యాండ్ సేవలపై అక్కడి ఎయిర్లైన్లు ఆందోళన చెందుతున్నాయి. ఈ బ్యాండ్ వల్ల అనేక విమానాలు నిలిచిపోతాయని పేర్కొంటున్నాయి. విమానాల విషయంలో గందరగోళం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏటీ అండ్ టీ, వెరిజోన్ సంస్థలు కలిసి అమెరికాలో 5జీ సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. అయితే దీనివల్ల 36 గంటల్లోపే విమానయాన సంక్షోభం ఏర్పడుతుందని అమెరికా పౌర, సరకు రవాణా విమాన సేవల సంస్థలు పేర్కొన్నాయి. బోయింగ్ 777ఎస్ విమానాలు దేశంలోని పలు విమానాశ్రయాల్లో ల్యాండ్ అయ్యే ప్రమాదం ఉండదని ఓ అధికారి పేర్కొన్నారు. బోయింగ్ కార్గో విమానాలు సైతం నిలిచిపోవచ్చన్నారు. వైడ్‌బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లపై 5జీ సర్వీసులు తీవ్ర ప్రభావం చూపుతాయి. వందలాది విమానాలు నిలిపిపోయే ప్రమాదం ఉంది. వేల మంది అమెరికన్లు ఎక్కడికక్కడే చిక్కుకుపోతారు అని విమానయాన సంస్థలు వెల్లడిరచాయి.