అభిలాష్, రోహి నయన్ జంటగా రూపొందిన చిత్రం సిన్స్ 1975. సురేంద్ర మాదారపు దర్వకత్వంలో బెల్లాన అప్పారావు నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భగా బెల్లాన్ అప్పారావు మాట్లాడుతూ ఒకప్పటి టాప్ గ్యాంగ్స్టర్ కథ ఆధారంగా సురేంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనంతరం దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ ఇదొక రస్టిక్ గ్యాంగ్స్టర్ సినిమా. సహజత్వం కోసం అంతా కొత్తవారితోనే చేశాం. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి అన్నారు. ఒకప్పటి గ్యాంగ్స్టర్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. త్వరలోనే ఫస్ట్ లుక్తో పాటు విడుదల తేదీ ప్రకటించనున్నాం అన్నారు నిర్మాత. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: కన్నా. సహ నిర్మాతలు: గడ్డం శిరీష, నల్లపు రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: సురేష్ బాబు అట్లూరి.














