Namaste NRI

కొత్త పాటతో.. లక్ష్మీ నరసింహా .. రీ రిలీజ్

2004లో వచ్చిన బాలకృష్ణ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ లక్ష్మీ నరసింహా. జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ నిర్మించిన ఈ చిత్రం ఆ ఏడాది ఘన విజయాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను 4కె వెర్షన్‌లోకి మార్చి,  ఈ నెల 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తెలిపారు.

ఈ రీరిలీజ్‌ వెర్షన్‌లో ఓ కొత్త పాట కూడా యాడ్‌ అయ్యిందని, మందేసినోడు అంటూ సాగే ఈ పాటని చంద్రబోస్‌ రాయగా, భీమ్స్‌ సిసిరోలియో అన్‌స్టాపబుల్‌ వైబ్‌తో కంపోజ్‌ చేశారనీ, స్వరాగ్‌ కీర్తన్‌ ఆలపించిన ఈ పాట ఈ న్యూవెర్షన్‌కే హైలైట్‌ కానున్నదని బెల్లంకొండ సురేశ్‌ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events