Namaste NRI

కాంగ్రెస్ గెలుపుతో ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో …విజయోత్సవ సంబురాలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు ఘనంగా జరిపారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు  జరిగాయి. అడ్వైజరీ బోర్డు సభ్యులు ఓరుగంటి కమలాకర్ రావు, గంగసాని ప్రవీణ్ రెడ్డిలు ఈ విజయం ప్రజలందరికి అంకితం అని, బాధ్యత యుతంగా వ్యవహారిద్దాం అని పిలుపు ఇచ్చారు. ఏక వ్యాఖ్య తీర్మానం ద్వారా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఏఐసీసీకి లేఖ ద్వారా తెలపడం జరిగింది.

కార్యదర్శి శ్రీధర్ నీలా సభాధ్యక్షులుగా జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో స్థిరపడ్డ డాక్టర్లు, ఇంజనీర్‌లు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొని కాంగ్రెస్ విజయ అవశ్యకతని వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీధర్ మంగళరపు, రాకేష్ బిక్కుమండ్ల సభ నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారు. మహిళ నేతలు మేరీ, సరిత మైనారిటీ నేతలు సయ్యద్, జవహర్ రెడ్డి, కళ్యాణ్, శ్రీనివాస్, ప్రవీణ్, నరేష్, పాల్గొని విజయవంతం చేశారు. ఈ  సంబురాల్లో  సుమారు 200 మంది కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events