Namaste NRI

ఈ సినిమాతో ప్రేక్షకులు గేమ్ వరల్డ్లోకి వెళ్లిపోతారు

గీతానంద్‌  హీరోగా దయానంద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్‌ ఆన్‌. రవి కస్తూరి నిర్మాత. నేడు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా గీతానంద్‌ మాట్లాడుతూ ఇదొక యూనిక్‌ స్టోరీ. హీరో లూజర్‌ నుంచి విన్నర్‌గా ఎలా మారాడు అనేది ఇందులో అసక్తికరమైన అంశం అన్నారు.  ఈ చిత్ర దర్శకుడు దయానంద్‌ నా తమ్ముడే. ఇద్దరం కలిసి చాలా షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశాం. తమ్ముడు కథ రాస్తే నేను నటించేవాడ్ని. లేదంటే వాడి కథను నేను డైరెక్ట్‌ చేసేవాడ్ని. ఆ అనుభవం ఈ సినిమా విషయంలో బాగా ఉపయోగపడింది.  స్క్రిప్ట్‌ విషయం లో బాగా డిస్కస్‌ చేసుకునేవాళ్లం. రియల్‌టైం సైకలాజికల్‌గా సాగే ఈ సినిమాతో ప్రేక్షకులు గేమ్‌ వరల్డ్‌లోకి వెళ్లిపోతారు. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఇందులోని బ్యాక్‌స్టోరీ ఎవరూ ఊహించలేరు అనేంతగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ హైలైట్‌. విజువల్స్‌ కొత్తగా ఉంటాయి. సాంకేతికంగా నెక్ట్స్‌ లెవల్లో ఉంటుందీ సినిమా. ప్రీమియర్‌ షోస్‌ చూసినవాళ్లంతా అద్భుతం అంటున్నారు. ఈ సినిమాకు వచ్చే స్పందనను బట్టి సీక్వెల్‌ ప్రకటిస్తాం అని చెప్పారు.

ఈ చిత్రానికి మ్యూజిక్ డైర‌క్ట‌ర్, అభిషేక్ ఏ ఆర్; సాంగ్స్ః న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ – అరుణ్‌, సినిమాటోగ్రఫీ: అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌, స్క్రిప్ట్ సూప‌ర్ వైజ‌ర్: విజ‌య్ కుమార్ సి.హెచ్, ఎడిట‌ర్: వంశీ అట్లూరి, ఆర్ట్ః విఠ‌ల్‌, యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీః రామ‌కృష్ణ‌. న‌భా స్టంట్స్, స్టైలింగ్ః ద‌యానంద్‌, పిఆర్ఓః జి.కె మీడియా, కొరియోగ్ర‌ఫిః మోయిన్, నిర్మాత‌: ర‌వి క‌స్తూరి, క‌థ‌-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్: ద‌యానంద్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events