పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన క్షిపణులను ఉపయోగించి ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యాపై తొలి దాడి చేసింది. రష్యాపై లాంగర్ రేంజ్ క్షిపణులను ప్రయోగించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్‌కు అనుమతి ఇచ్చారు. బైడెన్ అనుమతి ఇచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్ ప్రభుత్వం పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన క్షిపణులను ఉపయోగించి రష్యా సరిహద్దులపై తొలి దాడికి పాల్పడింది.
దాంతో రష్యా త్వరలో ప్రతీకారం తీర్చుకోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే రష్యాపై ఉక్రెయిన్ నాటో దళం పంపిన క్షిపణిని ప్రయోగించింది. ఇది తనపై పరోక్షంగా నాటో దాడిగా రష్యా భావిస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది. అణ్వాయుధ రహిత దేశాలపై అణ్వాయుధాల ప్రయోగానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలిపారు. దాంతో ఉక్రెయిన్ సహా అణ్వాయుధరహిత దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించాలని ప్రయోగించేందుకు రష్యా సైన్యానికి అనుమతి లభించింది.