హర్షసాయి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం మెగా. డాన్ ఉపశీర్షిక. మిత్ర కథానాయికగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. టీజర్, టైటిల్‌ను అనౌన్స్ చేశారు. టీజర్‌లో హర్ష సాయికి కావల్సినంత ఎలివేషన్స్ ఇచ్చారు, దీని ద్వారా పాత్ర పవర్ ని మనం ఊహించవచ్చు. యంగ్ స్టర్ తన అరంగేట్రంలో గొప్ప ముద్ర వేశాడు. హీరోని చంపడానికి ప్రయత్నించే వ్యక్తి గ్రహాంతరవాసిలా కనిపిస్తున్నారు. ఓవరాల్‌గా, టీజర్ కాన్సెప్ట్ , ప్రెజెంటేషన్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. కల్వకుంట్ల వంశీధర్‌రావు సమర్పిస్తున్న ఈ చిత్రానికి పడవల బాలచంద్ర సహ నిర్మాత. హర్షసాయి మాట్లాడుతూ ఇది భిన్నమైన నేపథ్యంలో సాగే కథ. ఓ కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు చూస్తారు అన్నారు. కల్వకుంట్ల వంశీధర్‌రావుగారు చాలా సపోర్ట్ చేశారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. చిన్న ఆలోచనతో మొదలై భారీ స్థాయికి చేరిన సినిమా ఇది. ఆదిపురుష్ కి పనిచేసిన డీవోపీ కార్తీక్ పళని ఈ సినిమాకు పనిచేశారు. హర్షసాయి ఈ సినిమాతో పెద్దహీరో అవుతాడు అని నిర్మాత చెప్పారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: వికాస్ బాడిసా, నిర్మాణం: శ్రీ పిక్చర్స్.
