Skip to main content

Namaste NRI

వారు లేకపోతే ఈ సినిమా లేదు : ఆకెళ్ల వి.కృష్ణ

జగపతిబాబు, లయ, హృతికా శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలు పోషించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వదలా. ఆకెళ్ల వి.కృష్ణ దర్శకుడు. కిశోర్‌ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్‌ నిర్మాతలు. త్వరలో విడుదల కానున్నది. హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో జగపతిబాబు మాట్లాడారు. బంగారం లాంటి టీమ్‌ ఈ సినిమాకు పనిచేశారు. ఓల్డ్‌ మ్యాన్‌ – యంగ్‌ గర్ల్‌ కాన్సెప్ట్‌తో ఆకట్టుకునే థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు అని అన్నారు.

టీజర్‌ చూశాక సినిమాను వెంటనే చూడాలనిపిస్తున్నదని, జగపతిబాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని నటి లయ చెప్పారు. జగపతిబాబు, తమ్మారెడ్డి భరద్వాజ్‌, చోటా కె.నాయుడు, నిర్మాత కిశోర్‌ ఈ సినిమాకు నాలుగు స్తంభాలు. వారు లేకపోతే సినిమా లేదు. పేరుకు నేను దర్శకుడ్నయినా, వారు చెప్పిన మార్పులే సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి అని దర్శకుడు ఆకెళ్ల వి.కృష్ణ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Click Here
Click Here

తాజా వార్తా చిత్రాలు

NRI Events