Namaste NRI

వర్జీనియాలో ఘనంగా ఆటా మహిళా దినోత్సవ వేడుకలు 

వర్జీనియా లో  అమెరికా తెలుగు సంఘం (ఆటా) 11వ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్మయ సోమ్‌నాథ్, చాంటిలి నగరంలో జరిగిన వేడుకలకు ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల , ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు జ్యోతివెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 11వ వార్షికోత్సవం ఎంబ్రాస్‌ ఈక్వాల్టీ థీం తో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వాషింగ్టన్ ఏరియాలోని వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిన మహిళ నాయకులు అట్ లర్జ్ ఫర్ ఫేర్ఫాక్స్ కౌంటి స్కూల్ బోర్డ్ చైర్‌ మెంబర్‌ రచ్న సిజెమొరె హైజెర్‌, ఫర్ ఎనైస్ సొల్యూషన్స్ కార్పొరేషన్ అధినేత్రి మగ్దలెన్ జన్సన్ ఓబాజి, తారు టెక్నోలోజిస్ అధినేత్రి అనుపమ కటికనేనిని సత్కరించారు. వివిధ రంగాల్లో ప్రతిభను, అనుభవాలతో పాటు మహిళా సాధికారత, మహిళా ఆరోగ్యం, మహిళా అభ్యున్నతి, ఆర్థిక స్వాతంత్య్రం అంశాలపై చర్చలు నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో , నృత్య కార్యక్రమాలు, క్విజ్  పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా బుజాల, నందినిరెడ్డి ఏడుల్ల, అనిత ముత్తోజు, గాయత్రి చొక్కవరపు, షీతల్ బొబ్బ, ప్రశాంతి ముత్యాల, అనూష  గంజి  , రవల్లిక బానోత్, ప్రత్యూష నరపరాజు, రోహిణి చల్ల  కు ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు సుధీర్ బండారు దిగ్విజయం కావడానికి సహకరించిన వివిధ దాతలకు, స్పాన్సర్స్ (వైర జువెల్స్, దేశి 360, పరిణయ ట్రెండ్స్, సోమిరెడ్డి లా గ్రూప్, కాకతీయ కిచెన్, కంట్రి ఓవెన్,హల్లో 2 ఇండియా గ్రాసరి, దేసి చౌరస్తా, ఆర్క్, స్కై సొల్యూషన్స్‌, లేబెల్ బై వీన, అదవంతజె ఈట్ ఇంక్ అండ్‌ కిరాక్ ఎంటర్‌టేన్‌మెంట్‌ ) కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు, రీజనల్ డైరెక్టర్ కౌశిక్ సామ, రీజనల్ అడ్వయిజర్‌ సుధీర్ దామిడి, రవి చల్లా, రీజనల్ కో-ఆర్డినేటర్ హనిమి వేమిరెడ్డి, అమర్ పాశ్య, హర్ష భరెంకబై, లోహిత్ రెడ్డి, మల్ల కాల్వ, రాము ముండ్రాతి, అమర్ బొజ్జ, వెంకట్ వూట్కురి, అనిల్ బొయినపల్లి, రాణా చెగు, కిరణ్ పదెర, పవన్ గోవర్ధన, అనిల్ కాశినేని, నవీన్ రంగ, ప్రవీణ్ దాసరి, శ్రీధర్ సన, సంజయ్ నాయుడు   పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కావడానికి సహకరించిన ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాలకు ప్రత్యేక ధ‌న్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events