ధీరజ్ మొగిలినేని నిర్మించిన పిల్లల సినిమా సమ్మర్ హాలిడేస్. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకుడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శితమ వుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడారు. టీమ్ అంతా ప్యాషన్‌తో వర్క్ చేయడం వల్లే ఈ విజయం. దయచేసి ప్రేక్షకులు ఆలస్యం చేయకుండా థియేటర్లకొచ్చి సినిమా చూడండి. ఇలా ఆలస్యం చేయడం వల్ల మంచి సినిమాలు థియేటర్లలో మిస్ అవుతూనే ఉంటాయి. ఓటీటీలో సినిమా చూసి అభినందిస్తే ఎవరికీ ఉపయోగం ఉండదు. మీరంతా థియేటర్లలో చూస్తేనే మా పర్పస్ నెరవేరేది. సమ్మర్ హాలిడేస్ లాంటి మంచి సినిమాలను ప్రోత్సహిస్తే శ్రీకర్ లాంటి దర్శకులు మంచి కథలు తెరకెక్కించగలుగుతారు.అన్ని వయసుల వారూ చూడాల్సిన సినిమా సమ్మర్ హాలిడేస్. పిల్లలతో సినిమాకు వస్తే వాళ్లకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది.నేను స్టార్స్ తో సినిమాలు ప్రొడ్యూస్ చేశా. కానీ పిల్లలతో సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ సంతోషం, సంతృప్తి కలిగాయి అని అన్నారు.

ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మీ ఫేస్‌లో ఒక స్మైల్ ఉంటుంది. మంచి ఎమోషనల్ ఫీల్‌తో వస్తారు అని దర్శకుడు శ్రీకర్ చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.















