బెంగళూరుకు చెందిన నాలుగేళ్ల పాప శ్రీనిత అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారానికి చెంందిన పులి సత్యనారాయణ, అర్చన దంపతుల కుమార్తెనే శ్రీనిత. ఉద్యోగ రీత్యా బెంగళూరులోని బీహెచ్‌ఈఎల్‌లో మేనేజర్‌గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు. నాలుగేళ్ల ప్రాయంలోనే ఆ చిన్నారి గత జులై 15 మొదట 53 సెకన్లలో ఆవర్తన పట్టికలోని 118 మూలకాల పేర్లను వేగంగా పఠించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అనంతరం తన రికార్డునే తానే బ్రేక్ చేసింది.
జులై 16న 49 సెకన్లలో వాటిని పఠించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకున్నది. అదేరోజు ఇంటర్నేషనల్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఆ శ్రీనిత తల్లిదండ్రులది స్వగ్రామం కాటారం కావడంతో స్థానికులు సంబురపడ్డారు.