Namaste NRI

వరల్డ్ రికార్డు సాధించిన రామ్‌ చరణ్ కటౌట్‌.. హెలికాప్టర్​తో

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న తాజా చిత్రం గేమ్‌ఛేంజర్‌. త‌మిళ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంకర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా,  కార్తీక్ సుబ్బ‌రాజు క‌థ‌ను అందిస్తున్నాడు. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి​ కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా  హీరో రామ్‌చరణ్‌ 256 అడుగుల భారీ కటౌట్‌ ఏర్పాటుచేసి మెగా అభిమానులు వరల్డ్‌ రికార్డు సాధించారని నిర్మాత దిల్‌ రాజు కొనియాడారు. విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన ఈ కటౌట్‌కు హెలికాప్టర్‌ ద్వారా పూలాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన దిల్‌ రాజు మాట్లాడుతూ సినీ రాజధాని, తెలుగు సినిమా పుట్టినిల్లుగా పేరొందిన విజయవాడలో ఈ ఈవెంట్‌ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జనవరి 1న గేమ్‌ఛేంజర్‌ ట్రైలర్‌ విడుదల చేస్తున్నామని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇచ్చే సమయాన్ని బట్టి జనవరి 4, 5 తేదీల్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసినందుకు గాను ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ రికార్డ్‌ను ఆ సంస్థ ప్రతినిధులు దిల్‌ రాజుకు అందజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress