Skip to main content

Namaste NRI

ప్రపంచ రికార్డు .. రూ.1,022 కోట్లు పలికిన పెయింటింగ్‌

మాస్టర్‌ ఆఫ్‌ సర్రియలిజం రెనె మగ్రిట్టే వేసిన పెయింటింగ్‌ ప్రపంచ రికార్డు సాధించింది. న్యూయార్క్‌లోని ఆక్షన్‌ హౌస్‌ క్రిస్టీలో జరిగిన వేలంలో ఇది 121,160,000 డాలర్లు (సుమారు రూ.1,022 కోట్లు) పలికింది. ఇది 1954నాటి ఆయిల్‌-ఆన్‌-కాన్వాస్‌ పెయింటింగ్‌ అని క్రిస్టీ తెలిపింది. కాంతి సామ్రాజ్యం పేరుతో చిత్రీకరించిన ఈ పెయింటింగ్‌లో, ప్రకాశవంతమైన వసంతకాల పగటి వెలుగులను, కారుమబ్బులు, శ్మశాన భయంకర చీకటిని పక్కపక్కనే చూపించారు. దీనికి 95 మిలియన్‌ డాలర్లు వస్తాయని అంచనా వేశామని, అంతకు మించిన ధర పలికిందని క్రిస్టీ తెలిపింది.

Social Share Spread Message

Latest News