అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం చోటు చేసుకున్నది. పదే పదే తన గదిని శుభ్రం చేసుకోవాలని చెబుతున్నదని 17 కుర్రాడు తన తల్లిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఫ్రయింగ్ ప్యాన్‌తో తల్లి తలపై దాడి చేసిన అతడు అనంతరం కత్తితో పొడిచాడు. తర్వాత ఆమె పర్సులో ఉన్న డబ్బు తీసుకుని కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు దావాఖానకు తరలించారు. ఈ సందర్భంగా తన కొడుకే ఈ పని చేసి పరారయ్యాడని తెలిపింది. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఓ అటవీ ప్రాంతంలో పట్టుకున్నారు. విచారణ సందర్భంగా గదిని శుభ్రం చేసుకోవాలని తరచు చెబుతుండటంతో ఫ్రయింగ్ ప్యాన్‌తో ఆమెను కొట్టానని, అనంతరం కత్తితో పొడిచానని చెప్పారు. ఆమెను గన్‌తో కాల్చాలని తన స్నేహితునికి చెప్పానని వెల్లడిరచారు.