Namaste NRI

వామ్మో.. 29 కోట్లు పలికిన చేప.. అంత ప్రత్యేకత ఏంటో?

ప్రపంచంలోనే అతి ఖరీదైన, విలువైనదిగా ప్రసిద్ధి పొందిన జపాన్‌లోని బ్లూఫిన్‌ ట్యూనా చేప మరో రికార్డును సృష్టించింది. 2026 కొత్త సంవత్సర ప్రారంభంలో ఒక టూనా చేప రూ.32 కోట్లకు అమ్ముడుపోయి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. జపాన్‌ సంప్రదాయ టోయోస్‌ ఫిష్‌ మార్కెట్‌లో ఈ ఏడాది జరిగిన తొలి వేలంలో 240 కిలోల చేప 510 మిలియన్‌ యెన్‌లు (సుమారు రూ.32 కోట్లకు) అమ్ముడుపోయి కొత్త చరిత్రను సృష్టించింది. 243 కిలోలున్న ఈ చేపను నలుగురు మోసుకుని ఈ వార్షిక బిడ్డింగ్‌కు తీసుకురాగా, ప్రముఖ సుషీజన్మయి సుషి రెస్టారెంట్‌ చైన్‌కు చెందిన కియోమూరా కార్పొరేషన్‌ భారీ ధర చెల్లించి దీనిని దక్కించుకుంది. వేలంలో కొనుగోలు చేసిన అనంతరం దీనిని సుషిజన్మయి ప్రధాన ఔట్‌లెట్‌కు తరలించారు. తర్వాత దీనిని సంప్రదాయ పద్ధతిలో కట్‌ చేసి దేశంలోని వివిధ ఔట్‌లెట్‌లకు పంపిస్తారు. ఈ చేపతో తయారు చేసిన సుషీని సామాన్య మెనూ ధరకు అందిస్తారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events