సుహాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం రైటర్ పద్మభూషణ్. కథానాయిక టీనా శిల్పరాజ్. షణ్ముక ప్రశాంత్ దర్శకుడు. అనురాగ్ రెడ్డి, శరత్చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుం ది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ అన్ని చోట్ల ఈ సినిమా ప్రీమియర్స్కు మంచి స్పందన లభిస్తున్నది. సినిమా బాగుందని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ రిలీజ్కు ముందే మేం విజయం సాధించినట్లుగా ఫీలవుతున్నాం. ఈ సినిమా మా అందరి అంచనాల్ని నిజం చేస్తుందన్న నమ్మకం ఉంది. సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పండి అన్నారు. సుహాస్ మాట్లాడుతూ థియేటర్లో రిలీజ్ అవుతున్న నా తొలి చిత్రమిది. ప్రీమియర్స్కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది అని అన్నారు. విడుదలకు ముందే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉందని కథానాయిక టీనా శిల్పరాజ్ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)