కర్ణాటక రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. కొద్దివారాలుగా ఈ విషయంపై జోరుగా ప్రచారం సాగింది. అయితే ముఖ్యమంత్రి యెడియూరప్ప ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ వచ్చారు. గురువారం మాత్రమే ఆయన స్వయంగా సంకేతాలిచ్చారు. జులై 26 తర్వాత ముఖ్యమంత్రిగా తాను ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. తద్వారా ముఖ్యమంత్రి మార్పు తథ్యమన్న ప్రచారం మరింత జోరందుకుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే సోమవారం పార్టీ వేడుకలు జరుగుతాయి. ఆ తర్వాత హైకమాండ్ నుంచి వచ్చే ఆదేశాల నడుచుకుంటాను అని యోడియూరప్ప చెప్పారు. ఇప్పటి వరకైతే తనను రాజీనామా చేయమని అడగలేదని చెప్పారు. హైకమాండ్ నుంచి అలాంటి ఆదేశాలు ఏమైనా వస్తే పదదవి నుంచి తప్పుకుని, పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు.