ఈ ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతి యోగా అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నవిషయం తెల్సిందే. ఇందులో భాగంగా తొమ్మిదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి. ఈ ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతుల్లో ఒకటి. యోగా శరీరం, మనస్సు మధ్య సమతౌల్యం ఏర్పరుస్తుంది. యోగా మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్నిపెంచుతుంది. అందుకే యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరుతున్నాను అని రాష్ట్రపతి అన్నారు.


