Namaste NRI

యూ ఆర్‌ మై హీరో ప్రీ రిలీజ్‌ వేడుక

ఫిరోజ్‌ ఖాన్‌, సనాఖాన్‌, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్‌ గునాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా యూ ఆర్‌ మై హీరో. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ సమర్పణలో మౌంట్‌ ఎవరెస్ట్‌ పతాకంపై మిన్ని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ హారర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు షేర్‌. ఈ సినిమా ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా  చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ  తెలంగాణలో చిత్రీకరణకి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటక శాఖ నుంచి పలు సౌకర్యాలు కల్పిస్తున్నాం. సమాజానికి అవసరమయ్యే మంచి సినిమాలు తీసే వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.  నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ ఈ చిత్రంలో రొమాన్స్‌, సస్పెన్స్‌, హారర్‌ అంశాలుంటాయి. దర్శకుడు అందరికీ నచ్చేలా చిత్రాన్ని రూపొందించారు. చిన్న నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతున్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జెల నగేష్‌, బాలమల్లు, మౌసమ్‌, అసిఫ్‌, రష్మీ ఠాగూర్‌, షబ్నం, లక్ష్మి, నిర్మాత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events