అమెరికాకు బిజినెస్, పర్యాటక వీసాలపై వెళ్లే వారు అక్కడ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు కూడా హాజరుకావచ్చని యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. అయితే, ఉద్యోగంలో చేరే ముందు వీసాను మాత్రం మార్చుకోవాలని స్పష్టం చేసింది. అమెరికాకు వ్యాపార పర్యటనల నిమిత్తం వెళ్లే వారికి బీ-1 వీసా, టూరిస్టులుగా వెళ్లే వారికి బీ-2 వీసా ఇస్తారు. ఈ రెండు వీసాలపై ఉన్న వారు అమెరికాలో ఉద్యోగాన్వేషణ చేసుకోవచ్చా అని యూఎస్‌సీఐఎస్ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/WB-9.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/d5b7f241-3200-42f7-aeb9-47b1f0e899f3-9.jpg)