వీసా లేకపోయినా మా దేశానికి రావచ్చంటూ కొన్ని దేశాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. జర్మనీ, ఆస్ట్రియా, స్వీడెన్ దేశాలు ఈ జాబ్ సీకర్ వీసాను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ కాలపరిమితులపై జారీ చేసే ఈ వీసాతో విదేశీయులు ఆ దేశాల్లో జాబ్ ఆఫర్ లేకపోయినా కాలుపెట్టవచ్చు. అక్కడికెళ్లాక తీరిగ్గా ఉద్యోగం వెతుక్కోవచ్చు. అయితే ఈ వీసాకు దరఖాస్తు చేసుకునే వారు తమ రంగాల్లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. అంతేకాకుండా ఆయా దేశాల్లో ఖర్చులకు సరిపడా ఆర్థిక వనరులు సిద్ధం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కూడా రెడీగా ఉండాలి. ఆయా దేశాల్లో గుర్తింపు పొందిన కోర్సులకు సమానమైన డిగ్రీలకే గుర్తింపు ఉంటుంది. జర్మనీలో జాబ్ సీకర్ వీసాపై 9 నెలల పాటు నివసించే అవకాశం ఉండగా, ఆస్ట్రియాలో ఆరు, స్వీడెన్‌లో మూడు నెలలు ఉండేందుకు అనుమతి ఉంది.
