శివరాజ్‌కుమార్ ప్రధానపాత్ర పోషించిన చిత్రం కూర్మ అవతార్. రాజ్ తరుణ్, సాయికుమార్, శివాజీ, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రధారులు. హర్షవర్ధన్ కడియాల దర్శకుడు. పూజిత , సేవిత నిర్మాతలు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శివరాజ్‌కుమార్ మాట్లాడారు. కొత్త దర్శకుడు, పాత దర్శకుడు అనే పట్టింపులు నాకుండవు. కథ నచ్చితే చాలు. దర్శకుడిపై నమ్మకం ఉంచి సినిమా చేస్తాను. డైరెక్టర్ హర్ష అద్భుతమైన విజన్‌తో ఈ సినిమా తీశారు సాయికుమార్, శివాజీ, వరలక్ష్మి శరత్‌కుమార్‌లతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలు ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దిల్‌రాజు చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. శివరాజ్‌కుమార్ తో కలిసి పనిచేయడం పట్ల హీరో రాజ్‌తరుణ్ ఆనందం వెలిబుచ్చారు. దర్శకునిగా ఇది నా తొలి చిత్రం. అయినా నన్ను, నా కథనూ నమ్మి నాతో నడిచి, నన్ను నడిపించిన చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని దర్శకుడు హర్షవర్ధన్ అన్నారు. ఇంకా సాయికుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, నిర్మాతలు నరేంద్ర, పూజిత, సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ కూడా మాట్లాడారు.














