వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద వారితో సమానంగా పిల్లలు, యువతీ, యువకులు సైతం సత్తా చాటుతున్నారు. తాజాగా భారత మూలాలు ఉన్న ఆస్ట్రేలియా మహిళా నటాషా రaా భాస్కర్ ప్రతిష్టాత్మక యంగ్ ఆస్ట్రేలియన్ ఇన్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ 2022 అవార్డుకి అడుగు దూరంలో నిలిచింది. ఈ అవార్డు కోసం ఇటీవల ప్రకటించిన 25 మందితో కూడిన తుది జాబితాలో నటాషా కూడా ఉంది. ప్రభుత్వం, పైవేటు రంగాలకు సంబంధించి వివిధ విభాగాల్లో పని చేస్తున్న మహిళలను ఈ అవార్డు కోసం పరిగణలోకి తీసుకున్నారు. భారత సంతతికి చెందిన నటాసా రaా భాస్కర్ ఆస్ట్రేలియాలోని న్యూలాండ్ గ్లోబల్ గ్రూప్ (ఎన్‌జీజీ) జనరల్ మేనేజర్ హోదాలో పబ్లిక్ పాలసీ ఎక్స్‌పర్ట్‌గా పని చేస్తున్నారు. ఇండియా ఆస్ట్రేలియా సంబంధాల విషయంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. సిడ్నీలో ఆమె నివసిస్తున్న ఇండియన్ పార్లమెంట్ పాలసీకి సంబంధించి ఆమెకు 12 ఏళ్ల అనుభవం ఉంది.