Namaste NRI

నూతన సంవత్సర కానుకగా నువ్వునాకు నచ్చావ్‌

2001, సెప్టెంబర్‌ 6న విడుదలైన నువ్వు నాకు నచ్చావ్‌ సినిమా మరపురాని కుటుంబ ప్రేమకథగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఆ సినిమా పంచిన నాటి అనుభూతిని మళ్లీ నేటి తరానికి స్వచ్ఛంగా అందించేందుకు రంగం సిద్ధమైంది. నువ్వునాకు నచ్చావ్‌ చిత్రాన్ని పూర్తి సాంకేతిక హంగులతో 4కె లోకి కన్వర్ట్‌ చేసి, నూతన సంవత్సర కానుకగా 2026, జనవరి 1న విడుదల చేయనున్నారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

వెంకటేశ్‌, ఆర్తి అగర్వాల్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ, తివిక్రమ్‌ మాటల మాయాజాలం, ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుగా దర్శకుడు విజయభాస్కర్‌ మలచిన తీరు, వీటన్నింటితోపాటు సంగీత దర్శకుడు కోటి అందించిన అద్భుతమైన సంగీతం ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలబెట్టాయని చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కేవలం రీరిలీజ్‌ మాత్రమే కాదని, నూతన సంవత్సరంలో ఆడియన్స్‌కి తామందిస్తున్న కానుకని, ఈ సినిమా మా టీమ్‌కు ఓ అద్భుతమైన అనుభవమని ఆయన చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events