అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్యూ. దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ కథానాయికలు. ఈ చిత్రం నుంచి మరో మరో అనే గీతాన్ని విడుదల చేశారు. కాలేజీ నేపథ్యంలో వచ్చే యువతరం పాటిది. దీనికి తమన్ స్వరాలు సమకూర్చగా, విశ్వ, కిట్టూ విస్సాప్రగడ సంయుక్తంగా సాహిత్య మందించారు. దీపు, ప్రదీఫ్ ఆలపించారు. దీనికి కథ బీవీఎస్ రవి, ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్. జులై 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
