విదేశాలలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దుబాయిలోని వైఎస్ఆర్‌సీపీ అభిమానులు జగన్ జన్మదినోత్సవ వేడుకలను సందడిగా నిర్వహించారు. గల్ఫ్ దేశాలలో స్ధానిక అరబ్ ప్రజలకు ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల తరహా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అందిస్తున్నారని, ఈ సంక్షేమ పాలన ఇదే తరహా కొనసాగాలని కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త సత్తి ప్రసన్న సోమిరెడ్డి అకాంక్షించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2022/12/jagan-1.jpg)
సోమిరెడ్డి అధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకల కార్యక్రమంలో పడాల బహ్మానందరెడ్డి, తరపట్ల మోహన్, మోహమ్మద్ అక్రం, కోటేశ్వరరెడ్డి, కర్ణ మహేశ్, శివలింగారెడ్డి, నరసింహా, బాషా, షాకీర్, అంజద్, సత్య, విజయ, భూమ, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.