ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన వైసీపీ అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 90,533 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి 1,12,072, బీజేపీకి 21,661, కాంగ్రెస్‌కు 6,217, నోటాకు 3,636 ఓట్లు పోలయ్యాయి. ఇతర పార్టీలు దాదాపు పోటీ ఇవ్వలేకపోయాయని అధికార పార్టీ నేతలు తెలిపారు. ఈ ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. దీంతో బీజేపీకి కూడా ఊహించిన దానికంటే ఎక్కువే ఓట్లు వచ్చాయి. గతంలో పోలిస్తే ఎక్కువగా ఓట్లు వచ్చాయని, నియోజకవర్గంలో పార్టీ బలపడిరదని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.