Skip to main content

Namaste NRI

మణిపూర్‌ కొత్త సీఎంగా యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ప్రమాణం

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన తొలగిపోయింది. కొత్త సీఎంగా యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా నెమ్చా కిప్‌జెన్, లోసియి దిఖో, హోంమంత్రి గోవిందాస్ కొంతౌజమ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్‌లో అభివృద్ధిని తీసుకురావడానికి బీజేపీ జాతీయ నాయకత్వం తనకు పెద్ద బాధ్యత అప్పగించిందని సీఎం యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ తెలిపారు. తమ కొత్త ప్రభుత్వం అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తుందని చెప్పారు. 61 ఏళ్ల యుమ్నం ఖేమ్‌చంద్ మైతీ వర్గానికి చెందినవారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులైన నెమ్చా కిప్‌జెన్ కుకీ, లోసియి దిఖో నాగా తెగలకు చెందినవారు.

Social Share Spread Message

Latest News