తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చైర్మన్ నియామకం జరిగినప్పటికీ సభ్యుల నియామకాన్ని మాత్రం ప్రభుత్వం వాయిదా వేసింది. త్వరలోనే సభ్యులను నియమిస్తామని ఉత్తర్వులో పేర్కొంటి. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఈ నెల 11 లేదా 12వ తేదీన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులకు సమాచారం అందింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవి అందరూ ఊహించినట్లే మరోసారి వైవీ సుబ్బారెడ్డిని వరించంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019 జూన్ 21 న టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పాలక మండలి రెండు సంవత్సరాల పదవీకాలం జూన్ 21వ తేదీతో పూర్తయింది. అయితే వైవీని చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం.. త్వరలోనే సభ్యులను నియమిస్తామని పేర్కొంది.