స్విస్ స్కీ రిసార్ట్ దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) వార్షిక సమావేశం తొలి రోజు ఉక్రెయిన్ అధ్యక్షు డు వొలోదిమిర్ జెలెన్‌స్కీ బిజీ బిజీగా గడిపారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా, మధ్య ప్రాచ్యం, తదితర దేశాల ఉన్నత స్థాయి అధికారులు కూడా సమావేశానికి సన్నద్ధం అవుతున్నారు. రష్యాతో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో తమ దేశ వైఖరి గురించి రాజకీయ నేతలకు విశదం చేసేందుకు జెలెన్‌స్కీ ప్రయత్నిస్తున్నారు.
