రష్యా రాజధాని మాస్కో నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా డ్రోన్లు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ బలపడుతోందని, ఇప్పుడు రష్యాకు యుద్ధం రాబోతోందని అన్నారు. క్రమంగా యుద్ధం రష్యా భూభాగానికి తిరిగి వస్తోంది. ఆ దేశ ప్రతీకాత్మక కేంద్రాలు, సైనిక స్థావరాలకు వ్యాపిస్తోంది. ఇది అనివార్యమైన, సహజమైన, పూర్తి న్యాయమైన ప్రక్రియ అని ఉక్రెయిన్ నగరం ఇవానో ఫ్రాంకివ్స్కను సందర్శించిన సందర్భంగా జెలెన్ స్కీ పేర్కొన్నారు.