Namaste NRI

డొనాల్డ్ ట్రంప్‌ దెబ్బకు దిగొచ్చిన జెలెన్‌స్కీ  

అమెరికా సైనిక సహాయాన్ని తాత్కాలికంగా తక్షణమే నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ దిగొచ్చారు. ఇటీవల జరిగిన చర్చల్లో ట్రంప్‌తో గొడవ జరగడం నిజంగా విచారకరమని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విబేధాలు సరిచేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నామని తెలిపారు.

ఉక్రెయిన్‌-అమెరికా మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం, కమ్యూనికేషన్‌ నిర్మాణాత్మకంగా ఉండేలా జాగ్రత్త పడతానని జెలెన్‌స్కీ తెలిపారు. అమెరికా కోరుతున్న అరుదైన ఖనిజాలు అందించేందుకు సిద్ధమేనని ప్రకటించారు. దీనిపై ఒప్పందం కుదుర్చుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ట్రంప్‌ బలమైన నాయకత్వంతో ముందుకు వెళ్లి రష్యాతో యుద్ధానికి పలికేందుకు వీలైనంత వేగంగా పనిచేస్తామని ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events