రష్యా-ఉక్రెయిన్ యుద్ధ విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక కీలక ప్రతిపాదన చేశారు. కీవ్ ఆధీనం లో ఉన్న భూ భాగాన్ని నాటో పరిధిలోకి తెస్తే కాల్పుల విరమణకు తాను సిద్ధమేనని ప్రకటించారు. జెలెన్స్కీ మాట్లాడుతూ వేడిగా సాగుతున్న ఈ యుద్ధం దశను ఆపాలంటే మా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూ భాగాన్ని నాటో పరిధిలోకి తేవాలి. అలా జరిగితేనే రష్యా ఆక్రమించుకున్న మా ప్రాంతాన్ని దౌత్యమార్గంలో సాధించుకోవచ్చు. మేము వేగంగా చేయాల్సిందే అదే అని పేర్కొన్నారు. అయితే నాటోలోని ఏ దేశం కూడా తమతో ఇలాంటి ప్రతిపాదన తీసుకురాలేదని అన్నారు. దేశంలోని ఒక భూ భాగానికి మాత్రమే రక్షణ ఏర్పాటు చేయడం నాటోకు కూడా కష్టమేనని పేర్కొన్నారు. తమను నాటోలో చేర్చుకోవడం కష్టమేనని, అలాంటి ప్రతిపాదనేదీ కూడా రాలేదన్నారు.