Namaste NRI

జుకర్‌బర్గ్‌ తన భార్యకు…జీవితాంతం గుర్తుండిపోయే కానుక

ఫేస్‌బుక్‌  సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన భార్య ప్రిస్సిల్లా చాను పై తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే అపూర్వ కానుక ఇచ్చారు. రోమన్‌ సంప్రదాయంలో ఆమె శిల్పాన్ని చెక్కించి బహుమతిగా ఇచ్చారు. ఈ విగ్రహాన్ని ఇంటి పెరట్లో ఏర్పాటు చేశారు. తన విగ్రహం వద్ద ప్రిస్సిల్లా కాఫీ తాగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ శిల్పాన్ని న్యూయార్క్‌ నగరాని కి చెందిన ప్రసిద్ధ కళాకారుడు డేనియల్‌ అర్షమ్‌ రూపొందించినట్లు తెలిసింది.

జుకర్‌బర్గ్‌ – ప్రిస్సిల్లాది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుం టున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇది కాస్తా ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు. 2012 మే 19న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంటకు ముగ్గురు సంతానం. 2015లో మాక్సిమా చాన్ అనే అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత ఆగస్టు 2017లో మరో పాప ఆగస్ట్ జన్మించిం ది. ఇక గతేడాది అంటే 2023 మార్చిలో మరో పాప అరేలియా చాన్‌కు ప్రిస్సిల్లా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events