మెటా సీఈవో, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. హవాయి ద్వీపాల్లోని కవాయిలో కొంత భూమి కొనుగోలు చేసేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేశారట. అక్కడే ఓ విలసవంతమైన ఎస్టేట్‌ను నిర్మించుకునే పనిలో ఉన్నాడని సమాచారం. ఇందులో ఓ రహస్య బంకర్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిసింది. హవాయి ద్వీపాల్లోని కువాయి ప్రాంతాల్లో దాదాపు 1400 ఎకరాల భూమిని జుకర్‌బర్గ్ కొనుగోలు చేశారు. ఇందులో దాదాపు 5 వేల చదరపు అడుగుల్లో బంకర్ నిర్మిస్తున్నారు. విద్యుత్తు, ఆహారం వంటి సదుపాయాలు ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఇందుకోసం 260 మిలయన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారని తెలిసింది. దీనిపై జుకర్‌బర్గ్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.