హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని పీర్లెస్ హోటల్లో జుఒన్ సూపర్ యాప్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే అవసరాలకు వేర్వేరు యాప్లను ఉపయోగించే రోజులకు స్వస్తి పలుకుతూ, అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో ఈ యాప్ను తీసుకొచ్చారు.

ప్రముఖ సినీ నటి ఇంద్రజ, ఏఎన్ఎన్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి, జబర్దస్త్ రాము, యాప్ బ్రాండ్ అంబాసిడర్ రాధిక ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ యాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం నగరాలకే పరిమితం కాకుండా, సెమీ-అర్బన్ మరియు పట్టణ ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరించారు.

ఈ వేడుకలో నటి ఇంద్రజ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అన్ని సేవలను ఒకే వేదికపై అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఏఎన్ఎన్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సాంకేతికతను ప్రజల అవసరాలకు అనుసంధానిస్తూ రూపొందించిన ఈ యాప్ వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తుందని తెలిపారు. బ్రాండ్ అంబాసిడర్ రాధిక మాట్లాడుతూ 25 రకాల సర్వీసులు ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆకాంక్షించారు.

ఫౌండర్ అండ్ సీఈఓ పి. సురేంద్రబాబు మాట్లాడుతూ.. వినియోగదారులకు సులభమైన, నమ్మకమైన మరియు వేగవంతమైన డిజిటల్ సేవలను అందించడమే తమ లక్ష్యమని, పూర్తి వివరాల కోసం www.juone.in వెబ్సైట్ను సందర్శించవచ్చని తెలిపారు. ప్రొప్రైటర్ బి. వివేక్ మాట్లాడుతూ.. సౌకర్యం, వేగం మరియు సులభమైన అనుభవమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. టుగెదర్ ఫర్ ఏ స్మార్టర్ టుమారో నినాదంతో వస్తున్న ఈ సూపర్ యాప్ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన జీవనశైలిని అందించనుంది.

కనెక్ట్, సర్వీసెస్, గ్రో మరియు వన్ యాప్, మెనీ సొల్యూషన్స్ అనే నినాదాలతో ముందుకొచ్చిన జుఒన్ ద్వారా ఒకే యాప్లో ఫుడ్ డెలివరీ, గ్రాసరీ, ఫార్మసీ, క్యాబ్ బుకింగ్, కార్లు-బైక్ల అద్దె, లాజిస్టిక్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్ వంటి 25 రకాల సేవలను పొందవచ్చు. అలాగే హోటళ్లు, రిసార్టులు, ఈవెంట్లు, పర్యాటక సేవలు, హాస్టళ్లు, పీజీ వసతి బుకింగ్ సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. షాపింగ్, బ్యూటీ పార్లర్, ఇంటి శుభ్రత, పెస్ట్ కంట్రోల్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఏసీ సర్వీసులతో పాటు కంప్యూటర్, మొబైల్ మరమ్మతులు కూడా చేసుకోవచ్చు. ఆరోగ్య అవసరాల కోసం డాక్టర్ కన్సల్టేషన్, ల్యాబ్ టెస్టులు, నర్సింగ్ సేవలను కూడా ఒకే చోట అందించేలా దీన్ని రూపొందించారు.















