
అనుష్కశెట్టి లీడ్ రోల్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఘాటి . నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని తొలి సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. పుట్టగానే బ్రహ్మ ముడి పెట్టరో.. వయసు తాకి జంట కట్టెరో.. బతుకునంత తోడులోన చూసెరో.. అడుగు అడుగు మొదలుపెట్టెరో అంటూ జానపద ధోరణిలో సాగిన ఈ పాటను కృష్ణ రాయగా, నాగవెళ్లి విద్యాసాగర్ స్వరపరిచారు. లిప్సిక భాష్యం, సాగర్ నాగవెళ్లి, సోనీ కోమండూరి ఆలపించారు. రాజు సుందరం నృత్య రీతుల్ని సమకూర్చారు. కొత్తగా పళ్లైన హీరోహీరోయిన్ల నడుమ.. సాంస్కృతిక శోభతో ఓ సంబరంగా ఈ పాటను దర్శకుడు క్రిష్ చిత్రీకరించారు. ప్రకృతి సౌందర్యంతో నిండిన అడవుల నేపథ్యంలో ఈ ఫోక్ వెడ్డింగ్ యాంథమ్ ఉత్సవాన్ని తలపించింది. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: మనోజ్‌రెడ్డి కటాసాని, ఆర్ట్: తోట తరణి, సమర్పణ: యూవీ క్రియేషన్స్, నిర్మాణం: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటైర్టెన్మెంట్స్.
