అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విద్వేష, విచ్ఛిన్నవాదాలతో ప్రజలు విసుగెత్తిపో యారని డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ తెలిపారు. దేశాధ్యక్షుడు బైడెన్ కన్నా తాను భిన్నమని, దేశానికి కొత్త తరం నాయకత్వం అవసరమని ఆమె చెప్పారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన నేపథ్యంలో కమలా హారిస్ మాట్లాడారు. ట్రంప్ వ్యక్తం చేస్తున్న విద్వేషం, విచ్ఛిన్నవాదాలను ఆమె తీవ్రంగా విమర్శించా రు. ఆయన నాయకత్వ తీరు పట్ల ప్రజలు విసుగు చెందారని పేర్కొన్నారు. తుపాకుల వంటి మారణాయుధాల ను కలిగి వుండడంపై నిషేధం వుండాలని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. నేను జో బైడెన్‌ను కాను. కొత్త తరం నాయకత్వాన్ని అందించాలనుకుంటున్నానని హారిస్ చెప్పారు. 21వ శతాబ్దం సామర్ధ్యాన్ని సంపాదిం చేందుకు, అలాగే సవాళ్ళను ఎదుర్కొనడానికి రాబోయే పది, ఇరవై ఏళ్ళలో మనం చేయాల్సిన పనులేమిటి అనే అంశంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించనున్నట్లు హారిస్ చెప్పారు.