
విజయ్ ఆంటోని, స్వాసిక జంటగా నటిస్తున్న చిత్రం వంద దేవుళ్లు. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామాంజయనేయులు జవ్వాజి నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నిహారిక కొణిదెల విడుదల చేశారు. ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికి కనీస అవసరాలుంటాయి. తినడం, నిద్రపోవడం, తోడు వెతుక్కోవడం అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. భార్యాభర్తల, తల్లీకొడుకుల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తూ ఈ ట్రైలర్ సాగింది. గ్రామీణ నేపథ్యంలో రైతు కథ ఇదని మేకర్స్ తెలిపారు. అజయ్, కావ్య, శక్తి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ చిత్రానికి సంగీతం: బాలాజీ శ్రీరామ్, నిర్మాత: రామాంజనేయులు జవ్వాజి, దర్శకత్వం: శశి.





























