శ్రీరామ్, అవికాగోర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 10 క్లాస్ డైరీస్. ఈ చిత్రాన్ని అజయ్ మైసూర్ సమర్పణలో అచ్చుత రామారావు, పి.రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. గరుడవేగ అంజి దర్శకుడు. జులై 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బి.గోపాల్ మాట్లాడుతూ సహాయ దర్శకుడు కావాలనుకున్న నేను ముందు కెమెరా విభాగంలో చేశాను. సినిమాటోగ్రాఫర్ అంజి ఈ సినిమాతో దర్శకుడు కావడం సంతోషంగా ఉంది అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సినీ రంగానికి పూర్తి సహకారం అందిస్తున్నది. అందుకు ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు. ఈ చిత్ర సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పని చేశారు. సినిమాకు రావాల్సిన క్రేజ్ తీసుకొస్తున్నారు. శ్రీరామ్ ఎంచుకునే సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. ఆయన సినిమాలు చూస్తుంటారు. ఇందులో అవికా గోర్, హిమజ మంచి పాత్రల్లో నటించారు. ఈ సినిమా చూస్తుంటే నా మొదటి సినిమా హ్యాపీ డేస్ గుర్తొసోంది. ఈ సినిమా మంచి విజయం సాదించాలని కోరుకుంటున్నా అన్నారు. ఒకరికి ఒకరు తర్వాత నేను చేసిన మంచి చిత్రం టెన్త్ క్లాస్ డైరీస్ నటుడిగా నాకు పునర్జన్మ అనాలి అన్నారు శ్రీరామ్. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ బొబ్బిలి, ఛాయాగ్రాహకులు రామ్ ప్రసాద్, పీజీ విందాతోపాటు, కాసర్ల శ్యామ్, శ్రీరామ చంద్ర, చిన్నా, గీత తదితరులు పాల్గొన్నారు.
