Skip to main content

Namaste NRI

10 క్లాస్‌ డైరీస్‌ ప్రీ రిలీజ్‌ వేడుక

శ్రీరామ్‌, అవికాగోర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 10 క్లాస్‌ డైరీస్‌. ఈ చిత్రాన్ని అజయ్‌ మైసూర్‌ సమర్పణలో అచ్చుత రామారావు, పి.రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. గరుడవేగ అంజి దర్శకుడు. జులై 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ  చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  బి.గోపాల్‌ మాట్లాడుతూ సహాయ దర్శకుడు కావాలనుకున్న నేను ముందు కెమెరా విభాగంలో చేశాను. సినిమాటోగ్రాఫర్‌ అంజి ఈ సినిమాతో దర్శకుడు కావడం సంతోషంగా ఉంది అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సినీ రంగానికి పూర్తి సహకారం అందిస్తున్నది. అందుకు ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు. ఈ చిత్ర సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పని చేశారు. సినిమాకు రావాల్సిన క్రేజ్‌ తీసుకొస్తున్నారు. శ్రీరామ్‌ ఎంచుకునే సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. ఆయన సినిమాలు చూస్తుంటారు. ఇందులో అవికా గోర్‌, హిమజ మంచి పాత్రల్లో నటించారు. ఈ సినిమా చూస్తుంటే నా మొదటి సినిమా హ్యాపీ డేస్‌ గుర్తొసోంది. ఈ సినిమా మంచి విజయం సాదించాలని కోరుకుంటున్నా అన్నారు. ఒకరికి ఒకరు తర్వాత నేను చేసిన మంచి చిత్రం టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌ నటుడిగా నాకు పునర్జన్మ అనాలి అన్నారు శ్రీరామ్‌. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సురేష్‌ బొబ్బిలి, ఛాయాగ్రాహకులు రామ్‌ ప్రసాద్‌,  పీజీ విందాతోపాటు, కాసర్ల శ్యామ్‌, శ్రీరామ చంద్ర, చిన్నా, గీత తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events